ఆంధ్రప్రదేశ్లో 1502 కేసులు 16 మరణాలు
iraila 04, 2021
TV77తెలుగు అమరావతి:
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ 1500 దాటాయి. గడిచిన 24 గంటల్లో 63,717 మంది సాంపిల్స్ పరీక్షించగా.కొత్తగా 1,502 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.కోవిడ్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనా నుంచి 1525 మంది కోలుకోగా. ప్రస్తుతం14,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2019702కి చేరగా.ఇందులో 1990916 మంది పూర్తిగా కోలుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 13,903 మంది మరణించారు.కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు...