148 కేజీల గంజాయి స్వాధీనం
iraila 14, 2021
TV77తెలుగు రావులపాలెం:
అక్రమంగా మినీ వ్యాన్ లో తరిలిస్తూన్న 148కేజీల గంజాయిని పట్టుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నట్టు రావులపాలెం సి.ఐ
వి.కృష్ణ,యస్.ఐ.పి.బుజ్జి బాబు లు తెలిపారు.మంగళవారం స్ధానిక పోలీసు స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా యస్.పి.యమ్.రవీంద్రనాధ్ బాబు ఆదేశాలు మేరకు అమలాపురం డి.యస్.పి.వై.మాధవరెడ్డి సూచనలతో రావులపాడు శివారు మల్లాయి దొడ్డి గ్రామంలో హెచ్.పి.పెట్రోలు బంకు సమీపంలో జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి వచ్చే వాహనాల తనిఖీలు చేపట్టగా TN37DA 5040 నెంబర్ గల అశోక్ లేలాండ్ వ్యానులో 71గంజాయి ప్యాకెట్లు 6సంచులలో మూటకట్టి ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమిళనాడు కొయ్యంబత్తూరు పీలయేడుకు చెందిన సంధిల్ ప్రభును అరెస్ట్ చేసి వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు ఈ గంజాయి విలువ సుమారు రూ2,97,600ఉంటుందని ముద్దాయిని కొత్తపేట జె.ఎప్.సి.మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.