ఆంధ్రప్రదేశ్లో corona కొత్తగా878 కేసులు,13 మరణాలు నమోదు..!

*TV77తెలుగు* అమరావతి... రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,173 పరీక్షలు నిర్వహించగా.. 878 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,13,001 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా 13 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,838కి చేరింది. 1,182 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,65,76,995 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.....