మహమ్మద్‌ కయ్యుమ్‌ పాత్రలో సునీల్

*TV77తెలుగు* నటుడు సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రధారులుగా 'బుజ్జి ఇలా రా' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా సునీల్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సునీల్‌ మహమ్మద్‌ కయ్యుమ్‌ పాత్రలో కనిపించనున్నాడు. అంజి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'ఇట్స్‌ ఎ సైకలాజికల్‌ థ్రిల్లర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రూపా జగదీశ్‌ సమర్పణలో ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి, జి.నాగేశ్వరరెడ్డి టీమ్‌వర్క్‌ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.....