యువతిని రేప్ చేసిన వారే డబ్బులు డిమాండ్
abuztua 28, 2021
బెంగళూర్‌లో ఓ జంటను అడ్డగించి అత్యాచారం చేసిన దుండగులు మరిన్ని దారుణాలకు ఒడిగట్టారు. యువతిని రేప్ చేయడమే కాకుండా తమపై కేసు పెడితే.. అత్యాచారం చేసిన ఘటనను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు.గత మూడు రోజుల క్రితం మైసూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇద్దరు జంట వెళుతున్న
సమయంలో సాయంత్రం 8 గంటలకు ముగ్గురు దుండగులు వారిని అడ్డగించారు. అనంతరం యువకున్ని చితకబాదారు.
అంతటితో ఆగకుండా వెంట ఉన్న యువతిపై అత్యాచారం చేసి వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటన వెలుగు వచ్చిన తర్వాత బాధితులు ఆసుపత్రిలో చికిత్స పోందుతుండగా దుండగులు మరింత రెచ్చిపోయారు. ఓ వైపు
బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
బాధితుడి స్నేహితుడికి ఫోన్ చేసి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము అత్యాచారం చేసిన సంఘటనను బహిరంగ పరుస్తామని హెచ్చరించారు.
దీంతోపాటు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా... కేసు నమోదు చేసినా వెంటనే వీడియోను నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. ఎలాంటీ కేసులు లేకుండా ఉండాలని హెచ్చరించారు. (ప్రతీకాత్మక చిత్రం
కాగా సంఘటన జరిగిన కొద్ది గంటల్లోని బాధితులకు ఫోన్ చేసి బెదిరించడంతో నేరస్థులు కరుడు గట్టిన వారిగా పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా వాళ్లంతా 25 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారేనని పోలీసులు తెలిపారు.