దారితప్పిన కొందరి మగవారికోసం..

 


ఈ పోస్ట్ దారితప్పిన కొందరి మగవారికోసం.. పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి... ఇరవై రెండు సంవత్సరాలకే పిల్లలు... పాతికేళ్ళ వయసు రాగానే కుటుంబ బాధ్యతలతో సతమతం అవ్వటం... ముప్పైయేళ్ళు రాగానే జీవితం మీద విరక్తి చెంది... ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తాగుడుకు బానిసగా మారి... కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని పట్టించుకోవటం మానేసి... ఇలా పీకల దాకా తాగి రోడ్డు మీద పడిపోతే... భార్య పిల్లల పరిస్థితి ఏంటని ఒక్కసారైనా ఆలోచించండి... సమాజంలో నీ పిల్లలు గర్వంగా తలెత్తుకుని బ్రతకాలి అంటే... నువ్వు నీ జీవిత శైలిని మార్చుకోవాలి నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబం కోసం నీ జీవితాన్ని కూడా త్యాగం చేయాలి కానీ... ఇలా ముప్పైఏళ్లకే జీవితం మీద విరక్తి చెంది పీకలదాకా తాగేసి... నువ్వు రోడ్డు పక్కన పడటమే కాకుండా నీ భార్య పిల్లలను కూడా రోడ్డున పడేస్తున్నావ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి... అర్ధం చేసుకుని ఆచరిస్తారని భావిస్తూ..