తెల్లవారుజామున ఘోర ప్రమాదం

*TV77తెలుగు* బెంగళూరు... మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. కర్నాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ మార్స్‌ వెల్ఫేర్‌ హాల్‌ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్‌ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే.. కరుణా సాగర్‌, బిందు (28), అక్షరు గోయల్‌, ఇషిత (21), ధనూష (21), రోహిత్‌, ఉత్సవ్‌ ఉన్నారు. కరుణా సాగర్‌, బిందు భార్యాభర్తలు. సెయింట్‌ జాన్స్‌ హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ కాలేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ కూడా సీటు బెల్ట్‌ ధరించలేదని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.