భారత్ లో రూథర్ ఫర్డ్ పాలన సాగుతుంది
abuztua 29, 2021
తూర్పుగోదావరి జిల్లా...
రాజమండ్రి.
ఆంధ్రప్రదేశ్ లోగల ప్రధాన రాజకీయ పక్షాల నేతల పై గల కేసులను బ్లాక్ మెయిల్ చేస్తు ఏపి వనరులను మోది సర్కార్ కార్పొరేట్లకు దోచిపెడుతుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేసారు.
బిజెపి (మోది)సర్కార్ పాలన అంతా ఆనాటి బ్రిటిష్ పాలనను తలపిస్తుందని, కుట్రలు కుయుక్తులతో ఆనాటి బ్రిటిష్ జనరల్ రూథర్ ఫర్డ్ భారతీయులను కట్టు బానిసలుగా మార్చి రూథర్ ఫర్డ్ పాలనకు తిరుగులేకుండా చేసుకున్నారని, అదే తరహాలో నేడు బిజెపి సర్కార్ ప్రధాని మోది రూపంలో భారతీయులతో ఆకలి కేకలు పెట్టిస్తున్నారని, మనిషి బ్రతికుండగానే జీవితాలను చిదిమేస్తున్నారని, విదేశీ శక్తులతో మోది సర్కార్ రహస్య ఒప్పందాలను కుదుర్చుకుని భారత్ అభివృద్ధి ని పతనం చేస్తు సంపదను అతి కొద్దిమందికి దారాదత్తం చేస్తున్నారని, మోది భారతదేశానికి ప్రధానిగా కాకుండా బహుళ జాతి వ్యాపార దిగ్గజాలకు సీఈఓ గా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.మోది పాలనలో ఆర్ధిక వ్యవస్థ పతనమై పోతుందని, బ్రతుకు భారమైపోతు వలసలు పోతున్నారని, ఇష్టాను సారం ధరలు పెంచుతు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారని, రహదారులు చిన్ద్ర వంద్రంగా వుంటున్నాయని,వాహనదారులు ప్రమాద కరమైన పరిస్థితులును ఎదుర్కొంటున్నారని, రోడ్లు నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, మోది పాలనలో అభివృద్ధి శూన్యం గా మారిందని, విదేశీయులకు, విదేశీ కంపెనీలకు పెద్ద పీట వేస్తు స్వదేశీయులను, స్వదేశి వ్యాపారాలను నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వసతులు కనుమరుగై పోతున్నాయని, మోది సర్కార్ అభివృద్ధిని సంపదను దోచుకుంటున్నారని, భారతీయులను బిక్షగళ్ళగా మార్చటమే మోది సర్కార్ ప్రధాన లక్ష్యం అని ఆయన విమర్శించారు.దేశ సంపదను మొత్తం అంబానీ, ఆదానీలకు దారాదత్తం చేస్తున్నారని, సామాన్యుల శ్రమను, వారి సంపదను పాలన ముసుగులో దోచుకుంటున్నారని, పెట్రోల్ డీజిల్ ధరలను రూపాయల్లో పెంచుతు పైసల్లో తగ్గిస్తు ప్రజలను మాయ చేస్తున్నారని, ప్రతినెలా ఆయిల్ ధరలు పెంచుకుంటు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నారని, కేంద్రం పరిధిలో వున్న ప్రతి ప్రభుత్వ సేవకు భారీగా ధరలు నిర్ణయించేశారని,మోది సర్కార్ కు ఎదురు లేకుండా బలహీనతలు, కేసులు వెంటాడుతున్న ముఖ్యమంత్రులను భయపెడుతు కేంద్ర ప్రభుత్వంకు అడ్డులేకుండా చేసుకుంటున్నారని, మోది పాలన లో దేశం అప్పుల ఊబిలోకి కూరుకు పోయిందని, మోది స్వార్ధ పాలనకు సగటున ప్రతి మనిషి, బావితరాలతో సహా అప్పును మోయాల్సిన దురదృష్టం వెంటాడుతోందని ఆయన ఆవేదన చెందారు.బహుళ జాతి సంస్థల ఆదేశాల మేరకు భారత్ లోగల ప్రభుత్వ రంగ సంస్థలును మోది సర్కార్ అమ్మేసే కుట్రలకు దారి చేసుకుంటుందని,ప్రధాన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నట్టు, విమర్శిస్తున్నట్టు చింతామణి నాటకాన్ని మైమరిపించే విధంగా ప్రజల దృష్టి మరల్చి తెరవెనుక భారీగా లాభపడుతున్నారని, ప్రజా ఉద్యమాలను అక్రమ కేసులతో అణచివేస్తు కిరాయి ఉద్యమాలను పాలకులే ప్రోత్సహిస్తున్నారని,భద్రత లేని పాలనలో అభివృద్ధిని బూచిగా చూపిస్తు శ్వాసకు సైతం ధరతో మీటర్ బిగిస్తు పాలన ముసుగులో దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.కని విని ఎరుగని కోవిడ్ 19(కరోనా)విపత్తులో కూడా మోది సర్కార్ ప్రజలకు అండగా నిలవకుండా వైద్యం పేరుతొ ప్రజల నుండి లక్షలు దోచుకున్నారని,కరోనా విపత్తులో అర కోరగా ఉచితంగా వ్యాక్సిన్ చేసి ప్రైవేట్ వ్యాక్సిన్ ధర వేలల్లో దోచుకున్నారని, ఒక భయంకరమైన విపత్తులో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందివ్వకుండా ప్రజల ఆరోగ్యాలను వ్యాపారంగా మార్చుకోవటానికి మోది సర్కార్ కు,
ఆ పార్టి నేతలకు సిగ్గులేదని, మోది సర్కార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలపై కాలకూట విషం చిమ్ముతుంటే కేసీఆర్, జగన్ మోదికి చెక్క భజన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.రోజు రోజుకు దేశ వ్యాప్తంగా ప్రధాని మోది ప్రభ భారతదేశ ప్రజల్లో దిగజారి పోతుందని, 2014 సం నుండి నేటి వరకు అడ్డగోలుగా పెంచిన నిత్యావసర గ్యాస్ ధర 440/-గా వుంటే 2021 సం లో 920/- గాను, పెట్రోల్ 65/- నుండి 109/- గాను, డీజిల్ 55/- నుండి 99 రూపాయల 50 పైసలు గా నేడు ప్రజల నెత్తిపై తీవ్ర భారం మోపారని, రైల్వే టిక్కెట్ ధర కూడా ఆకాశాన్ని అంటే విధంగా పెంచారని, ప్రధాని హోదా లో మోది ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి వచ్చి రాజధాని గా శంకుస్థాపన చేసి నేడు ఏపి రాజధాని విశాఖపట్నం అని మోది కేబినేట్ మంత్రి నిర్లజ్జగా మాట్లాడుతుంటే మోది సర్కార్ కు సిగ్గులేదా అని ఆయన ఆగ్రహం వ్యక్త పరిచారు.మోది సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలైన రైళ్లు, రోడ్లు, ఓడ రేవులు, ఎయిర్ పోర్టులు, గోడౌన్లు, స్టేడియంలు, గ్యాస్, విధ్యుత్ పైప్ లైన్లను ప్రయివేట్ ముసుగులో విదేశీ సంస్థలకు కట్టబెట్టే కుట్రలు సాగిస్తున్నారని, ఏపికి ఐకాన్ వంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఆమ్మేస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు తిరగబడి భారతదేశాన్ని కాపాడుకోక పొతే భారత్ ను విదేశీయులకు ఆమ్నెసి ఆఫ్గాన్ అధ్యక్షుడు పారిపోయినట్టు మోది పారిపోయే ప్రమాదం వుందని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.
సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ కాసా రాజు, ఎవిఎల్ నరసింహారావు, దుడ్డె త్రినాద్, లంక దుర్గాప్రసాద్, సిమ్మా దుర్గారావు, దుడ్డె సురేష్వ, ర్ధనపు శరత్ కుమార్, వల్లి శ్రీనివాసరావు, ఎస్ కే వల్లి, కొలిమళ్ల రఘు, ఎండి హుస్సేన్, మార్త ప్రభాకర్, వల్లి వెంకటేష్, కొల్లి సిమ్మన్న,మండవల్లి సూరిబాబు, వాడపల్లి జ్యోతిష్ తదితరులు పాల్గొనియున్నారు.....