తెలంగాణలో భారీ వర్షం
abuztua 26, 2021
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి భాగ్యనగరంతో పాటూ ఉత్తర తెలంగాణలో వర్షం కురిసింది. సిటీలోని ఎల్బీ నగర్, ఉప్పల్, బేగం పేట్, సికింద్రాబాద్‌లో వర్షం పడింది. అలాగే కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, బోయిన్ పల్లి, బాలానగర్, మూసాపెట్, ఎర్రగడ్డలో భారీగా వర్షం కురసింది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.