భారీగా పెరిగిన బిర్యానీ ధరలు

*TV77తెలుగు* *హైదరాబాద్* అప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభం ప్రియులపై పడింది. అఫ్గాన్ నుంచి మసాలా దినుసుల దిగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ వాటి ధరలు ఆకాశాన్నంటున్నాయి. జులైతో పోలిస్తే ఆగస్టులో వాటి ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్ బిర్యానీ ధరలను తయారీదారులు పెంచేశారు. గత నెలలో సాజీరా కిలో రూ.380 ఉండగా.ఇప్పుడు రూ.600కి చేరింది. అంజీరా రూ.650 నుంచి రూ.1400, బ్లాక్ అఫ్రికాట్స్ రూ.300 నుంచి రూ.700, గ్రీన్ అఫ్రికాట్స్ రూ.300 నుంచి రూ.750 వరకు పెరిగింది. హైదరాబాద్‌లోని బిర్యానీ తయారీలో వినియోగించే మసాలా దినుసులు ఎక్కువగా అఫ్ఘానిస్తాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. చాలామంది అఫ్గాన్ వ్యాపారులు హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటుచేసుకుని మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఇండియాకు దాదాపు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలు పెరగడంతో రెస్టారెంట్ల యజమానులు సైతం బిర్యానీ ధరను ఏకంగా రూ.100కి పైగా పెంచేశారు. హైదరాబాద్‌లో గతంలో బిర్యానీ ప్లేట్ ధర రూ.250 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.350వరకు పెరిగింది. నెల రోజుల క్రితం జంబో ప్యాక్ ధర రూ.600 ఉండగా. రెస్టారెంట్లను బట్టి రూ.700-800 వరకు పెరిగింది. రూ.400 ఉండే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ధర రూ.550 వరకు పెంచేశారు. జొమాటో, స్విగ్గీ తదితర యాప్‌ల నుంచి ఆర్డర్ చేసుకునేవారికి డెలివరీ ఛార్జీలు, ఇతర ట్యాక్సులు అదనం. అసలే వర్షాలు పడే కాలం. ఈ సమయంలో వేడివేడిగా బిర్యానీ తిని ఎంజాయ్ చేద్దామంటే పెరిగిన ధరలు భయపెడుతున్నాయని బిర్యానీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.....