తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు

*TV77తెలుగు* రాజమహేంద్రవరం... మలేరియా డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగావించాలని వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాద్ ని వైద్యాధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక నగరపాలక సంస్థ నందు ఆమె మలేరియా డెంగ్యూ వ్యాధి సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు చేపట్టిన చర్యల పురోగతిని సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం విశాఖపట్నం ఉభయగోదావరి జిల్లాలలో మలేరియా డెంగ్యూ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రానున్న నెల లో మరింతగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం కాకినాడ డివిజన్లలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున యాంటీ లార్వా ఆపరేషన్లు ఫాగింగ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించాలని శుక్రవారం రోజున డ్రై డే లు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు మలేరియా దోమలు ఉత్పత్తికి కారకమయ్యే మురికి కుంటలు వాడేసిన కొబ్బరి డొక్కలు నిరుపయోగంగా ఉన్న టైర్లలో దోమల ఉత్పత్తి కి ఆస్కారం లేకుండా నియంత్రణ కొరకు మలేరియా స్ప్రేయింగ్ ఫాగింగ్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టి ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ భాగస్వామ్యంతో పూర్తి సమన్వయ వహించాలని ఆమె సూచించారు అదేవిధంగా వ్యాధులు సోకిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట నమోదు అవడానికి గల కారణాలను అన్వేషించి ఆ ప్రకారం గ్యాప్ లను పూరించి వ్యాధుల నియంత్రణ కొరకు చర్యలు తక్షణమే చేపడుతూ వ్యాధులు నియంత్రణకు పాటుపడాలని ఆమె సూచించారు వ్యాధులు మరింతగా స్పీడ్ కాకుండా నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గౌరీశ్వరరావు మలేరియా జోనల్ అధికారిని డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి జిల్లా వైద్య సేవలు సమన్వయ అధికారిని డాక్టర్ రమేష్ కిషోర్ రాజమండ్రి కాకినాడ నగరపాలక సంస్థల వైద్యాధికారులు డాక్టర్ వినూత్న పృద్వి చరణ్ 13 మంది మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు....