బంగార్రాజు' టైటిల్ పోస్టర్: సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభం
abuztua 25, 2021
కింగ్ అక్కినేని నాగార్జున మూడు దశబ్దాలకు పైగా ఉన్న తన సినీ కెరీర్‌లో ప్రతి జానర్ లోనూ విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్తవాళ్లను పరిచయం చేసి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు. ఈ పోటీ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అలానే తనయుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తండ్రీకొడుకుల ద్వయం కలిసి '' బంగార్రాజు '' చిత్రంతో ప్రేక్షకులకు అలరించడానికి రెడీ అయ్యారు.