తల్లి కావలసిన తరుణంలో కన్నుమూసిన భారతీయ మహిళ శిశువు జన్మించినా..

*TV77తెలుగు* ఫ్లోరిడా... భారతదేశానికి చెందిన ఒక యువతి తల్లి కావలసిన తరుణంలో కన్నుమూసింది. ఈ విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది. కేరళకు చెందిన ఇందు శోభా మాథ్యూ (34) ఫ్లోరిడాలో నివసించేది. గర్భంతో ఉన్న ఇందుకు ఆగస్టు 25న డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. కానీ ఆ రోజు ఆమెకు ఎటువంటి పురిటి నొప్పులూ రాలేదు. దీంతో డెలివరీని వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈ నెల 28న ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.ఆమె డెలివరీకి డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.అయితే డెలిరీ కోసం ఆస్పత్రికి వచ్చిన ఇందు బంధువులు.ఆమె స్పృహ కోల్పోయిందని, కళ్లు తెరవడం లేదని చెప్పారు. ఏం జరిగిందని పరిశీలిస్తే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఇందుది కేరళలోని అలప్పూజ మావెలిక్కర ప్రాంతం. ఇందు మరణంతో.ఆమెకు పుట్టిన బిడ్డకు కొన్ని సమస్యలు ఎదురైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పుట్టిన బిడ్డను 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత కాసేపటికి బిడ్డ కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ వార్త విన్న ఇందు తల్లిదండ్రులు మాథ్యూ సైమన్, గ్రేసీ సైమన్ దుఃఖంలో మునిగిపోయారు....