చూపు తిప్పుకోనివ్వని అందంతో రౌడీ స్టార్ బ్యూటీ

Tv 77 TELUGU: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ప్రస్తుతం లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడికి హీరోయిన్ గా ప్రస్తుతం బాలీవుడ్ లో మస్త్ గా డిమాండ్ ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న లైగర్ సినిమా తో సౌత్ లో కూడా ఈమె ఫేమస్ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. లైగర్ సినిమా విడుదల కాకుండానే సౌత్ లో ఈ అమ్మడు స్టార్ గా వెలుగు వెలుగుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈమె ఫొటోలు మరియు వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంది. ఆ ఫొటోలు మరియు వీడియోలు అన్ని విధాలుగా సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అమె అందం కు జనాలు ఫిదా అవుతున్నారు. అనన్య పోస్ట్ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఎప్పుడు కూడా ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు మరోసారి వావ్ అనిపించేంత సెక్సీ ఫోజ్ లతో ఫొటోలను షేర్ చేసింది. స్టైల్ తో పాటు సెక్సీ అని కొందరిని మాత్రమే అనగలం. అనన్య పాండే ఆ కేటగిరిలో వస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె స్టైలిష్ గా ఉండటంతో పాటు ఆకట్టుకునే రూపం.. స్కిన్ టోన్ అన్ని విధాలుగా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ నెటిజన్స్ తో పాటు సినీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోల్లో అనన్యను చూస్తూ ఉంటే చూపు తిప్పలేనంత అందంగా ఉందనిపిస్తుంది. బాలీవుడ్ లో 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. కరోనా వల్ల ఈమె సినిమాల సంఖ్య తగ్గాయి. లేదంటే ఇప్పటి వరకు పది సినిమాల వరకు ఈమె పూర్తి చేసి ఉండేది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాటు హిందీలో మరో సినిమాను చేస్తోంది. ఇక ఈమె కొత్తగా రెండు మూడు సినిమాలను కూడా చేసేందుకు సిద్దంగా ఉంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.