ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లా లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ పలు జిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఉత్తర బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇది దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు....