పార్టీ లో కష్టపడినవారికి తగిన గుర్తింపు లభిస్తుంది చందన నాగేశ్వర్.
abuztua 25, 2021
పార్టీ లో కష్టపడినవారికి తగిన గుర్తింపు లభిస్తుంది
చందన నాగేశ్వర్.
రాజమహేంద్రవరం : స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారిని పార్టీ కార్యాలయంలో కలిసిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యకర్తలు. మహిళ కార్యకర్తలు చందన నాగేశ్వర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ప్రాంతాల్లో ఉన్నా సమస్యలను వివరించి, మహిళ కార్యకర్తలకు కమిటీ లో చోటు కల్పించాలి అని కోరారు, చందన నాగేశ్వర్ గారు స్పందిస్తూ పార్టీ లో కష్ట పడినవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది అని, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చెల్లాయమ్మ,సరితా, రాణి, లక్ష్మీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.