వినేశ్‌ ఫొగాట్‌ దూకుడు.. క్వార్టర్స్‌కు చేరుకున్న రెజ్లర్‌

TV 77 TELUGU : టోక్యో: భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ సోఫియాను 7-1 తేడాతో ఓడించింది. మ్యాచులో ఆది నుంచీ ఆధిపత్యం చలాయించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్‌లో 2, 2, 1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్‌లో 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్థి 1 పాయింటు సాధించింది.