భారీగా గంజాయిని ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

హైదరాబాద్‌‌లో... భారీగా గంజాయిని ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.21 కోట్లు ఉండదని చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తోన్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.విశాఖ ఏజెన్సీ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7,500 కిలోల గంజాయి అధికారులు పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో 25 మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు..