గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాముఖ్యత.
abuztua 25, 2021
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాముఖ్యత..
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఒక్క స్మశాన వాటిక నిర్మించే విధంగా చర్యలు చేపడుతున్నాం.
రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా..
రాజనగరం నియోజకవర్గంలోని స్మశాన వాటికల అభివృద్ధికి, నిర్మాణానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా తెలిపారు..
బుధవారం నాడు రాజానగరం మండలం వెలుగుబంధ గ్రామంలో స్మశాన వాటిక శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్మశాన వాటికను నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
అందులో భాగంగానే వెలుగుబంధ గ్రామంలో దాదాపు 60 లక్షల రూపాయలతో గైట్ కళాశాల యాజమాన్యం చైతన్య రాజు, శశికిరణ్ ల సహకారంతో స్మశాన వాటిక నిర్మాణానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు.
రఘుదేవపురం గ్రామంలోని బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి కోటేశ్వరరావు గారు ముందుకు రావడం హర్షించదగిన విషయమన్నారు..
స్మశాన వాటికల నిర్మాణంతోపాటు కనీస మౌలిక సదుపాయాలయిన ప్రహరీ గోడలు, ఆర్చ్, గేట్లు, అంత్యక్రియల సమయంలో వచ్చిన వారి కోసం వెయిటింగ్ హాల్స్,లాకర్లు, వాష్ రూమ్స్, దహన సంస్కార సమయంలో వినియోగించే కర్రల కోసం స్టోర్ రూమ్ వంటివి ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
ప్రతి గ్రామానికి కనీస అవసరాలయిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడీ భవనాలు, సి.సి డ్రైన్లు నాడు-నేడులో భాగంగా పాఠశాల భవనాలను ఆధునీకరించడం వంటి నిర్మాణాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.
వాటర్ గ్రిడ్ పథకం ద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి త్రాగునీరుగా అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు..
నియోజకవర్గంలోని వివిధ ప్రైవేటు రంగ సంస్థలు తమ సి.ఎస్.ఆర్ నిధులతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో గైట్ కళాశాల సీ.ఈ.వో సుబ్బరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ రామరాజు వైఎస్ఆర్సిపి నాయకులు దూలం పెద్ద, నాళ్ళం రోశయ్య, వాసంశెట్టి పెద్ద వెంకన్న, వేమగిరి కృష్ణ,కామేశ్వరరావు, వి.శ్రీనివాస్, ప్రగాఢ చక్రి ప్రగాఢ గోవింద్ తదితరులు పాల్గొన్నారు..