జైలులో రిమాండ్ ఖైదీ జయప్ప మృతి

చిత్తూరు జిల్లా: జైలులో రిమాండ్ ఖైదీ జయప్ప మృతి చెందారు. బుధవారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మరణించారు. అటవీ శాఖలో డ్రైవర్‌గా పని చేసిన జయప్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై కేవీపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13 నుంచి చిత్తూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మృతి విషయం బయటకు పొక్కకుండా జైలు సిబ్బంది జాగ్రత్త వహించారు. అయితే జైలు సిబ్బంది తీరుపై మృతుడు జయప్ప అనుమానం వ్యక్తం చేస్తున్నారు.