విజయ పాల వాహనం అదుపుతప్పి బోల్తా

*TV77తెలుగు* కృష్ణా జిల్లా... ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి శివారు లూర్దు నగర్ సమీపంలో జాతీయ రహదారిపై విజయ పాల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం ఉదయం హనుమాన్ జంక్షన్ వైపు నుంచి పాల ప్యాకెట్లను దిగుమతి చేసి తిరిగి విజయవాడ వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాల వాహనం పూర్తిగా దెబ్బతిన్నది. వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఆత్కూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు......