నకిలీ చలాన స్కాంలో కేసు నమోదు, రూ.7.32 లక్షలు రికవరీ

తూర్పుగోదావరి జిల్లాలో... సంచలనంరేపిన కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారంలో 39 చలానాలలో అవకతవకలు జరిగినట్లు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ ఆలమూరు సబ్ రిజిస్టార్ నలుగురు దస్తావేజు లేఖర్లుతో పాటు మరో వ్యక్తిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 39 చలానాలకు సంబంధించి రూ. 7,31,510లు అవకతవకలు గుర్తించామని, మొత్తం సొమ్మును రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయించామని తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుంచి వందశాతం నగదు రికవరీ చేస్తున్నామనారు.....