ప్రముఖ సినీ హీరో సుమన్ 62వ జన్మదిన వేడుకలు

ఎల్.ఐ.సి ఉద్యోగి అంగటి రమేష్ పార్వతి దంపతులు పలు సేవలు రాజమహేంద్రవరం రరూల్ : ధవళేశ్వరంలోని స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ వారి డే కేర్ సెంటర్ లోని వృద్ధులు మరియు వికలాంగుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాజమండ్రి ఎల్.ఐ.సి ఉద్యోగి అంగటి రమేష్ మరియు పార్వతి దంపతులు తెలియజేశారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు మరియు భోజనాలు అందరికీ ఏర్పాటు చేశారు. అందాల నటుడు, స్నేహశీలి, సమాజ సేవకులు, గొప్ప మానవతావాది అయిన సుమన్ ఈతరం ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని, శ్రీరాముని రూపాన్ని ఇలానే ఉంటుందని తెలియజేసిన మహా నటులు అని తెలియజేశారు. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు పొందాలని, విలక్షణమైన పాత్రల్లో నటించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి రాష్ట్ర కో ఆర్డినేటర్ ముద్దాల అను స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు......