ఆగస్టు 25 విమానయాన పర్యావరణ కమిటీ సమావేశం
abuztua 26, 2021
తూర్పుగోదావరి జిల్లా
రాజమహేంద్రవరం...
ఆగస్టు 25 విమానయాన పర్యావరణ కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధ్యక్షతన మధురపూడి విమానాశ్రయం నందు ఎయిర్ పోర్ట్ అధారిటీ కార్యాలయంలో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌరవిమానయాన సౌకర్యాలకు సంబంధించి పర్యావరణానికి పక్షులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ నాయక్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం అభిషేక్ కిషోర్ సబ్ కలెక్టర్ ఇలాకియ పాల్గొన్నారు తొలుత సెప్టెంబరు 11వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం.బబిత ఇతర న్యాయమూర్తులతో జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని న్యాయమూర్తులను కోరారు రాజీ పడదగ్గ కేసులన్నీ పరిష్కరించే దిశగా కకీదారులను చైతన్యపరిచి పెండింగ్ కేసుల సంఖ్య ను తగ్గించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సబ్ కలెక్టర్ ఇలా కియా న్యాయమూర్తులు అధికారులు పాల్గొన్నారు