నలుగురు నిందితులు అరెస్ట్ 16 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
abuztua 27, 2021
.
పశ్చిమగోదావరి జిల్లా..
విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడు తూ జిల్లా ఎస్పీ సమాచారం మేరకు కొవ్వూరు రూరల్ సీఐ రమణ, దేవరపల్లి ఎస్‌ఐ కె. శ్రీహరిరావు తమ సిబ్బందితో ఈ నెల 25న దేవరపల్లి శివారులో వాహ నాలు తనిఖీ చేస్తుండగా లారీలో 26 ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తున్న 807 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, దీని విలువ సుమారు రూ. 16 లక్షలు ఉంటుందన్నారు. తమిళనాడుకు చెందిన నిందితులు పెరుమాళ్ళు సురేష్, రామన్ ప్రభాకరన్, సురేష్ హరిహరన్, బాలసుబ్రహ్మణ్యం ప్రభాకరన్ అరెస్టుకు సహకరిం చిన ఎస్‌ఐ శ్రీహరిరావు, హెచ్‌సీ రామ్మోహనరావు, కానిస్టేబుల్ గంగరాజును అభినందించారు.....