15 కోట్ల 25 లక్షలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంబించారు

తూర్పుగోదావరి జిల్లా... రాజమహేంద్రవరం. స్థానిక నగర పాలక సంస్థ పరిధిలో శుక్రవారం వివిధ గ్రాంట్లు క్రింద సుమారు రూ 15 కోట్ల 25 లక్షలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంబించారు.. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు కురసాల కన్నబాబు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాల కృష్ణలు ప్రారంబించారు. తొలుతగా 49వ వార్డులో 14 ఆర్థిక పంఘం మరియు సాధారణ నిధులైన సుమారు 279 లక్షల అంచనా వ్యయంతో క్వారీ మార్కెట్ జంక్షన్ నుంచి లాలా చెరువు జంక్షన్ వరకు రోడ్డు అభివృద్ధి పనులును క్వారీ సెంటరువద్ద మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. 45వ వార్డు వాంబే గృహాలు వద్ద సుమారు రూ 105 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాలును బి.సి సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంబించారు. 23వ వార్డు పుష్కర ఘాట్ వద్ద బి.పి.ఎస్ మరియు ఎఆర్ఎస్ నిదులైన సుమారు రూ 325 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రక్షిత మంచి నీటి పరఫరా వ్యవస్థ పరిశీలన మరియు సమాచార సేకరణ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు కురసాల కన్నబాబు ప్రారంబించారు. అనంతరం మంచి నీటి సరఫరా వ్యవస్థ అదునిక సాంకేతికత పనితీరును మంత్రులకు నగర పాలక సంస్థ కమీషనరు ఎం అభిషిక్ కిశోర్ విశదీకరించారు. 16వ వార్డు వాంటే గృహాల వద్ద సుమారు రూ 125 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రై వేస్టు కలెక్షన్ కేంద్రాన్ని స్థానిక పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ ప్రారంభించారు. 10 వ వార్డు నందు మోడల్ కాలనీ నందు 14 వ ఆర్థిక సంఘం నిధులైన సుమారు రూ 693 లక్షల అంచనా వ్యయంలో నిర్మించిన ధవళేశ్వరం నుంచి మోడల్ కాలనీకి సురక్షిత త్రాగునీరు సరఫరా చేసే సప్లయి ప్రధాన కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేస్థానం పాలక మండలి అధ్యక్షులు వై.వి. సుబ్బారెడ్డి ప్రారంబించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టరు సి హరికిరణ్, రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ అధ్యక్షులు దవులూరి దొరబాబు, సబ్ కలెక్టరు ఇలాక్కియా శాసనమండలి సభ్యులు మోషేన్ రాజు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, రుడా చైర్మన్ ఎం షర్మిలారెడ్డి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు, రూరల్ కొర్డినేటరు చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు....