తప్పిపోయిన 10 సంవత్సరాల బాలుర ఆచూకీ గుర్తించిన పోలీసులు
abuztua 27, 2021
తూర్పు గోదావరి జిల్లా...
SP M.రవీంద్రనాథ్ బాబు IPS.ఆదేశాలతో అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఉప్పలగుప్తం SI లు హుటాహుటిన స్పందించి తప్పిపోయిన ఇరువురు బాలుర ఆచూకి గుర్తించడం జరిగింది గురువారం ఉదయం 11:30 గం. ప్రాంతంలో ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామం నుండి స్కూల్ కి వెళ్లి కనిపించకుండా పోయిన కొంకి అభిరామ్(10), వేపాటి బాబి(10) ఎవరికీ చెప్పకుండా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో ఉన్న తాతయ్య ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. విషయం ఉప్పలగుప్తం పోలీసులకు చేరగా తక్షణం స్పందించి ఇరువురు బాలుర ఆచూకీని గుర్తించి వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పందించి తక్కువ వ్యవధి కాలంలోనే ఇరువురి పిల్లలను అప్పగించిన పోలీసులకు వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు....